ప్రభుత్వ ఆఫీసులో క్లర్క్‌గా.. హ్యూమనాయిడ్ రోబో!

ABN , First Publish Date - 2020-07-15T04:29:57+05:30 IST

ఓ గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్‌గా హ్యూమనాయిడ్ రోబోను ఉంచారు.

ప్రభుత్వ ఆఫీసులో క్లర్క్‌గా.. హ్యూమనాయిడ్ రోబో!

సైబీరియా: ఓ గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్‌గా హ్యూమనాయిడ్ రోబోను ఉంచారు. ఇక్కడకు వచ్చిన వ్యక్తుల క్రిమినల్ రికార్డులు పరిశీలించి సర్టిఫికెట్లు ఇవ్వడం దీని పని. రష్యాలోని సైబీరియాలో ఓ ప్రభుత్వ ఆఫీసులో ఈ రోబోను విధుల్లో ఉంచారు. అభ్యర్థుల వివరాలు పరిశీలించి క్లీన్ క్రిమినల్ రికార్డులు ఉన్న వారికి ధ్రువపత్రాలు అందిస్తుందీ రోబో. సదరు అభ్యర్థులు డ్రగ్స్ కూడా ఎప్పుడూ వాడలేదని ఈ రోబో ధ్రువీకరిస్తుంది. మొత్తమ్మీద మనుషులు చూపించే 600 భావాలను ఈ రోబో కూడా చూపించగలదట.

Updated Date - 2020-07-15T04:29:57+05:30 IST