రూపాయి నోటు విడుదలై వందేళ్లు పూర్తి

ABN , First Publish Date - 2020-09-24T02:40:05+05:30 IST

రూపాయి నోటు విడుదలై సరిగ్గా వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వందేళ్లలో పరిస్థితులు చాలా మారాయి. ఈ వందేళ్ల కాలంలో ..

రూపాయి నోటు విడుదలై వందేళ్లు పూర్తి

రూపాయి నోటు విడుదలై సరిగ్గా వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వందేళ్లలో పరిస్థితులు చాలా మారాయి. ఈ వందేళ్ల కాలంలో రూపాయి నోట్లన్నీ ఆ మార్పులను ప్రతిబింబిస్తాయి. 30 నవంబర్, 1917లో మొట్టమొదటి రూపాయి నోటు విడుదలైంది. మొట్టమొదటి సారి విడుదల చేసిన రూపాయి నోట్లను ఇంగ్లండ్‌లో ముద్రించారు. నోటు ఎడమ వైపున ఐదవ జార్జ్ రాజు చిత్రం ఉండేది. నోటు వెనుకాల ఎనిమిది బాషల్లో ఒక రూపాయి అన్న పదాలు ఉండేవి. బ్రిటీష్ ప్రభుత్వం 19వ శతాబ్దం నుంచి కాగితం నోట్లను ముద్రించడం ప్రారంభించిందని ఆన్‌లైన్ మ్యూజియం, మేంటేన్ వరల్డ్ సీఈవో సుశీల్ కుమార్ అగర్వాల్ తెలిపారు. దానికి ముందే బ్రిటీష్ ఇండియా కంపెనీ బెంగాల్‌లో కాగితం నోట్లను ప్రవేశ పెట్టింది. కానీ మొదటి రూపాయి నోటును మాత్రం 1917లో ముద్రించారు.  ఆ తర్వాత పోర్చుగ్రీస్,  ఫ్రెంచ్ పాలకులు తమ సొంత రూపాయి నోట్లను ముద్రించడం ప్రారంభించారు. వాటిని నోవా, గోవా నోట్లు ఫ్రెంచ్ రూపీ అనేవాళ్లు. కొన్ని సంస్థానాలకు సొంత కరెన్సీ ఉండేది. భారతదేశం విభజన తర్వాత రూపాయి నోట్లు పాకిస్థాన్‌లో చెల్లుబాటు అయ్యాయి. స్వాతంత్ర్యానంతరం భారతీయ నోట్లపై బ్రిటన్ రాజముద్రల స్థానంలో అశోకచక్రం, మూడు సింహాలు వచ్చి చేరాయి. రూపాయి నోటు దానికి మినాయింపు కాలేదు. గత వందేళ్లలో 28 రకాల డిజైన్లలో సుమారు 125 భిన్నమైన రూపాయి నోట్లను ముద్రించారు. 


Updated Date - 2020-09-24T02:40:05+05:30 IST