నీరజ్‌ కోచ్‌పై వేటు

ABN , First Publish Date - 2021-09-15T09:04:07+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా కోచ్‌ యువె హాన్‌పై భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏ ఎఫ్‌ఐ) వేటు వేసింది.

నీరజ్‌ కోచ్‌పై వేటు

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా కోచ్‌ యువె హాన్‌పై భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏ ఎఫ్‌ఐ) వేటు వేసింది. హాన్‌ పనితీరు సంతృప్తిగా లేకపోవడంతో జాతీయ జావెలిన్‌ చీఫ్‌ కోచ్‌ పదవినుంచి అతడిని తప్పించినట్టు ఏఎ్‌ఫఐ అధ్యక్షుడు అదిల్‌ సుమరివాలా వెల్లడించారు. జర్మనీకి చెందిన 59 ఏళ్ల ప్రపంచ రికార్డు హోల్డర్‌ హాన్‌ కాంట్రాక్టు టోక్యో ఒలింపిక్స్‌తో పూర్తయింది. త్వరలో ఇద్దరు విదేశీ కోచ్‌లను నియమించనున్నట్టు సుమరివాలా తెలిపారు. కాగా..కొత్తగా ఒప్పందం కుదుర్చుకొనేలా ఏఎఫ్‌ఐ, భారత క్రీడా ప్రాధికార సంస్థ తనను బ్లాక్‌మెయిల్‌ చేశాయని ఒలింపిక్స్‌కు ముందు ఆరోపణలు చేయడం ద్వారా హోన్‌ సంచలనం సృష్టించాడు. 

Updated Date - 2021-09-15T09:04:07+05:30 IST