Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖలో నిర్విరామంగా హనుమాన్ చాలీసా గానం

విశాఖ: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం సంయుక్తంగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించింది. లోకకళ్యాణార్ధం, కరోనా నివారణార్ధం 24 గంటల పాటు నిర్విరామంగా హనుమాన్ చాలీసా గానం చేసింది. ప్రముఖ సంగీత విద్వాంసులు, ఆంజనేయ ఉపాసకులు, నిరంతర శ్రీరామ నామ జపపరాయణులు అయిన డాక్టర్ తాడేపల్లి లోకనాధ శర్మ స్థానిక బృందాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అంబికాబాగ్ శ్రీరామాలయంలో సుందరకాండ పారాయణం నిర్వహించారు.  శ్రీరామాలయ మాడ వీధుల్లో శోభా యాత్ర నిర్వహించడంతో పాటు ఆంజనేయ స్వామికి ఆకు పూజ, 108 వడల మాలను సమర్పించారు.  ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించి.. హనుమాన్ చాలీసా గానాన్ని ఆలపించారు. 


Advertisement
Advertisement