తెలంగాణకుతుపాను గండం!

ABN , First Publish Date - 2020-11-23T07:38:45+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో మంగళ, బుధవారల్లో విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ

తెలంగాణకుతుపాను గండం!

25, 26 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం

ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలపైనా ప్రభావం

రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి


 హైదరాబాద్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో మంగళ, బుధవారల్లో విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఆదివారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని వెల్లడించింది.

ఇది రానున్న 48 గంటల్లో తుపానుగా మారొచ్చని తెలిపింది. దీనికి ‘నివర్‌’ అని పేరు పెట్టారు. ఈ తుపాను ఈనెల 25న తీరాన్ని దాటే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో  25-26 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ  పేర్కొంది. 


Updated Date - 2020-11-23T07:38:45+05:30 IST