Abn logo
Aug 5 2021 @ 21:50PM

గోదావరిలో దూకి భార్యాభర్తలు మృతి

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో విషాదం నెలకొంది. బూర్గంపాడు మండలం గోదావరి నదిలో దూకి భార్యాభర్తలు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు వెలికి తీసారు. మృతులను పాల్వంచకు చెందిన లక్ష్మణ చారి (55), హేమలత (48)గా పోలీసులు గుర్తించారు. 4వ తేదీన భార్యాభర్తలు మిస్సింగ్ అయినట్లుగా కుటుంబ సభ్యులు కేసు పెట్టారు.