ఇద్దరు బిడ్డలతో భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు

ABN , First Publish Date - 2022-02-12T05:02:39+05:30 IST

ఇద్దరు బిడ్డలతో కలసి భార్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో అందుకు కారణమైన నిందితుడైన భర్తను శుక్రవారం రైల్వేపోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం స్థానిక జీఆర్‌పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ రామారావు ఆ కేసు వివరాలను వెల్లడించారు. చినగంజాం మండలం కుక్కలవారిపాలేనికి చెందిన కల్యాణికి దర్శి మండలానికి చెందిన నారాయణరెడ్డితో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు నందితారెడ్డి(5) వెంకటరెడ్డి(4) సంతానం.

ఇద్దరు బిడ్డలతో భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న జీఆర్‌పీ సీఐ రామారావు

చీరాల, ఫిబ్రవరి 11 : ఇద్దరు బిడ్డలతో కలసి భార్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో అందుకు కారణమైన నిందితుడైన భర్తను శుక్రవారం రైల్వేపోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం స్థానిక జీఆర్‌పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ రామారావు ఆ కేసు వివరాలను వెల్లడించారు. చినగంజాం మండలం కుక్కలవారిపాలేనికి చెందిన కల్యాణికి దర్శి మండలానికి చెందిన నారాయణరెడ్డితో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు నందితారెడ్డి(5) వెంకటరెడ్డి(4) సంతానం. కుటుంబంతో కలసి జీవనోపాధి కోసం తాడేపల్లి చేరుకున్నారు. ఈ క్రమంలో నిందితుడైన భర్త నారాయణరెడ్డి చెడువ్యసనాలకు లోనయ్యాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఈ నెల 8న మృతురాలు కళ్యాణి తన ఇద్దరు పిల్లలతో కలసి పుట్టిల్లు అయిన కుక్కలవారిపాలెం చేరుకోకుండా సమీపంలోని సోపిరాల రైల్వేగేటు వద్ద రైలుకు ఎదురుగా తన ఇద్దరు పిల్లలతో వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురూ చనిపోయారు. జీఆర్‌పీ సూపరింటెండెంట్‌, డీఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన దర్యాప్తులో భాగంగా భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన భర్త నారాయణరెడ్డిని అరెస్టు చేశామని సీఐ చెప్పారు. కేసు నమోదు చేసి రిమాండ్‌ కోసం కోర్టుకు హాజరు పర్చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఆర్‌సీ ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-02-12T05:02:39+05:30 IST