భార్యపై భర్త గొడ్డలితో దాడి

ABN , First Publish Date - 2021-01-17T06:13:30+05:30 IST

మండలంలోని దుర్గానగర్‌ తండాలో శనివారం చౌహాన్‌ విజయపై భర్త చౌహన్‌బండు గొడ్డలితో దాడి చేసినట్లు ఎస్సై రాం నర్సింహరెడ్డి, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

భార్యపై భర్త గొడ్డలితో దాడి
గాయపడిన చౌహాన్‌ విజయ

సారంగాపూర్‌, జనవరి 16 : మండలంలోని దుర్గానగర్‌ తండాలో శనివారం చౌహాన్‌ విజయపై భర్త చౌహన్‌బండు గొడ్డలితో దాడి చేసినట్లు ఎస్సై రాం నర్సింహరెడ్డి, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం విజయ చౌహన్‌ బండు వివాహం జరిగిందని, ఈ ఇద్దరి దంపతులకు సంతానం కల్గకపోవడంతో సంతానం కాదని ఉద్దేశ్యంతో విజయపై భర్త దండు గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయాలు కావడంతో నిర్మల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. విజయ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీ సులు పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-17T06:13:30+05:30 IST