మొగుడు.. పెళ్లాన్ని కొట్టడం తప్పేకాదట!

ABN , First Publish Date - 2021-11-29T09:38:27+05:30 IST

‘‘ఎవరన్నారు.. భర్తలు తమ భార్యలను కొట్టడం తప్పని! కొన్ని పరిస్థితుల్లో అది తప్పదు. భార్యలు భరించాల్సిందే..’’ ..

మొగుడు.. పెళ్లాన్ని కొట్టడం తప్పేకాదట!

తెలుగు రాష్ట్రాల్లోని 84 శాతం మంది 

మహిళల అభిప్రాయం ఇదే!

జాతీయ స్థాయిలో 30 శాతం మంది 

మగువల మద్దతూ పతులకే..!

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి


న్యూఢిల్లీ, నవంబరు 28: ‘‘ఎవరన్నారు.. భర్తలు తమ భార్యలను కొట్టడం తప్పని! కొన్ని పరిస్థితుల్లో అది తప్పదు. భార్యలు భరించాల్సిందే..’’ ఇవి.. ఏ రాజకీయ నాయకుడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కావు. భార్యలపై తమ ఆధిపత్య ధోరణిని సమర్థించుకునే యత్నంలో కొందరు పురుషులు చేసిన వ్యాఖ్యలు అంతకంటే కావు. ఇది దేశంలోని మెజారిటీ పెద్ద రాష్ట్రాల్లోని మహిళల అభిప్రాయం. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 30 శాతం మంది మహిళలు.. భార్యలను కొట్టే భర్తలను వెనకేసుకొచ్చారు. ‘భార్యలను భర్తలు కొట్టడం సమర్థనీయమేనా?’  అన్న ప్రశ్నకు ‘సమర్థనీయమే’ అని జవాబిచ్చారు. 



Updated Date - 2021-11-29T09:38:27+05:30 IST