Advertisement
Advertisement
Abn logo
Advertisement

నీ భార్య తప్పు చేస్తోంది.. అని పక్కింటి వ్యక్తి చెప్పడంతో ఆ భర్తకు డౌట్.. ఇంట్లో అన్ని గదుల్లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్.. చివరకు ఏం తేలిందంటే..

ఆమె ఒక వివాహిత.. ఒక ఆడపిల్లకు తల్లి కూడా.. అయినా ఆమె అసభ్యకరంగా ప్రవర్తించి నవ్వుల పాలైంది.. కూతురిని కూడా వేధించింది.. కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకుంది.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్‌పురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య, కూతురు ఉన్నారు. 


ఇంట్లో ఖాళీగా ఉంటున్న భార్య వ్యభిచారం చేస్తున్నట్టు చుట్టు పక్కల వాళ్లు నుంచి అతడు సమాచారం అందుకున్నాడు. దీంతో అతను గత నెలలో ఇంట్లో రహస్యంగా సీసీటీవీ కెమేరాలు ఫిక్స్ చేశాడు. తన భార్య ఢిల్లీలో ఉండే ప్రియుడితో నగ్నంగా వీడియో కాల్ చేస్తున్నట్టు గుర్తించాడు. ఒకరోజు ఆ ప్రియుడు నేరుగా ఇంటికే వచ్చాడు. 13 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాలను గమనించిన వ్యక్తి శనివారం సాయంత్రం కవినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఆమె ప్రియుడిపై కంప్లైంట్ ఇచ్చాడు. 


బాలిక నుంచి కవినగర్ పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. తండ్రి లేనపుడు తల్లిని కలిసేందుకు వచ్చే అంకుల్ తన బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తించేవాడని బాలిక చెప్పింది. తల్లి కూడా అతడినే సపోర్ట్ చేసేదని చెప్పింది. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement