Abn logo
Sep 26 2021 @ 03:18AM

భరణం కోసం కోర్టుకెక్కినందుకు.. భార్యను ఆ భర్త ఏం చేశాడంటే..

భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక, అతడిని వదిలేసి భరణం కావాలంటూ కోర్టు కెక్కింది. ఇది తెలిసిన ఆ భర్త కోపంతో ఆమె తల్లితండ్రుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమెను పట్టుకొని చితకబాదాడు. ఆ తరువాత ఆమె ముక్కుని కోసి, పక్కనే ఉన్న తన పిల్లలను కూడా కొట్టాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో జరిగింది.


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో నివసించే దినేళ్ మాలితో ఆలోట్ నగరంలో నివసించే టీనాకి 2008లో వివాహమైంది. పెళ్లైన కొద్ది కాలానికే దినేశ్ ఒక తాగుబోతు అని, ఏ పనిపాట లేక బలాదూర్‌గా తిరిగే వ్యక్తి అని టీనాకు తెలిసిపోయింది. అతను ఆమెను తరచూ వేధించేవాడు, తాగి కొట్టేవాడు. వారిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలున్నారు. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేని టీనా, అతడిని వదిలేసి తన ఇద్దరు కూతుర్లతో తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. 2019 లో తనకు భరణం కావాలని భర్త దినేశ్‌పై కేసు పెట్టింది. కేసు ఉపసంహరించుకోవాలని దినేశ్ ఆమెను బెదిరించేవాడు, ఆమె వినకపోవడంతో చివరికి టీనా ముక్కును కోశాడు.

ప్రత్యేకంమరిన్ని...