భార్య అంటే ప్రేమ ఉన్న‌వారు... బైక్‌ను ఇలా త‌యారు చేస్తారు!

ABN , First Publish Date - 2020-07-06T14:13:07+05:30 IST

ఒక్కోసారి ఏదో ఒక అంశంలో ఎంపిక చేసుకునేందుకు చాలా త‌క్కువ అవ‌కాశాలు ఉంటాయి. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు ఇటువంటి సంద‌ర్భాలు ఎదుర‌వుతుంటాయి. కొంత‌మంది మ‌హిళ‌ల‌కు బైక్‌పై అడ్వెంచ‌ర్...

భార్య అంటే ప్రేమ ఉన్న‌వారు... బైక్‌ను ఇలా త‌యారు చేస్తారు!

న్యూయార్క్‌: ఒక్కోసారి ఏదో ఒక అంశంలో ఎంపిక చేసుకునేందుకు చాలా త‌క్కువ అవ‌కాశాలు ఉంటాయి. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు ఇటువంటి  సంద‌ర్భాలు ఎదుర‌వుతుంటాయి. కొంత‌మంది మ‌హిళ‌ల‌కు బైక్‌పై అడ్వెంచ‌ర్ చేయాల‌ని ఉంటుంది. అయితే ఇందుకు వారికి ఉప‌యోగ‌ప‌డేలాంటి ఆఫ్ రోడ్ బైక్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఇటువంటి సంద‌ర్భంలో ఒక వ్య‌క్తి  తన భార్య కోసం ఆఫ్-రోడ్ బైక్ తయారుచేశాడు. దీనిని చూసిన‌వారంతా అత‌నిని అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. ఈ  బైక్ రూపకల్పనను మెచ్చుకుంటున్నారు. అమెరికాకు చెందిన కాంబ్రీ కోసం ఆమె భ‌ర్త జాచ్ నెల్స‌న్ ఒక‌ ఏడాదిపాటు శ్ర‌మించి ఈ బైక్ త‌యారుచేశాడు. రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను జోడించి, దాని మధ్యలో ఒక పెద్ద సీటును ఏర్పాటు చేశారు. తద్వారా ఒకరు ఈ బైక్‌పై ఎంతో సౌక‌ర్యంగా కూర్చోగ‌లుగుతారు. ఈ బైక్‌కు అత‌ను నాట్‌ వీల్‌చైర్‌ అని పేరు పెట్టాడు. ఈ ఆఫ్ రోడ్ బైక్ మంచు, కొండ ప్రాంతాలలో సులభంగా ప్రయాణిస్తుంది. దీనిపై ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుందని, అలసిపోకుండా సుదీర్ఘ ప్రయాణం చేయవచ్చ‌ని జాచ్ నెల్స‌న్ తెలిపారు. దివ్యాంగులు ఈ బైక్ ద్వారా అడ్వెంచ‌ర్ చేయ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఈ బైక్ వెనుక భాగంలో సామాను ఉంచుకోవ‌డంతోపాటు, టెంట్‌కూడా తీసుకువెళ్ల‌వ‌చ్చు. 



Updated Date - 2020-07-06T14:13:07+05:30 IST