Advertisement
Advertisement
Abn logo
Advertisement

పుట్టింటికి వెళ్లిన భార్య నెట్టింట్లో ప్రత్యక్షం.. ఆమెను అలా చూసి భర్త షాక్.. చివరికి!

ఇంటర్నెట్ డెస్క్: చైనాలోని ఓ వ్యక్తికి అతని భార్య షాకిచ్చింది. పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి.. వెళ్లిన భార్యను ఆన్‌లైన్‌లో చూసి కంగుతిన్నాడు. తన భార్య గురించి అసలు నిజాలు తెలుసుకుని నివ్వెరపోయాడు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించగా.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఇన్నర్ మంగోలియాలోని బయన్నూర్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఎదురుకట్నంగా 1,48,000 యువాన్‌లు (ఇండియన్ కరెన్సీలో రూ. 16.9లక్షలు) చెల్లించి మరీ ఓ యువతిని పెళ్లాడాడు. యువతి ఇంట్లోని కొన్ని సమస్యల కారణంగా సదరు వ్యక్తి తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకోలేదు. ఈ క్రమంలో భర్త అంగీకారంతో పెళ్లైన కొద్ది రోజులకే భార్య తన పుట్టింటికి వెళ్లింది. అలా పుట్టింటికి వెళ్లిన భార్యను.. అనుకోకుండా నెట్టింట్లో చూసి ఆ భర్త షాక్ అయ్యాడు. సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుండగా.. అతని భార్య మరో వ్యక్తిని వివాహం చేసుకునే దృశ్యాలను చూసి కంగుతిన్నాడు. వెంటనే సదరు వ్యక్తి తన భార్యకు ఫోన్‌ చేశాడు. స్పందన లేకపోవడంతో.. అత్తమామలకు కాల్ చేశాడు. అక్కడా అదే పరిస్థితి ఎదురవడంతో హుటాహుటిన తన భార్య స్వగ్రామానికి బయల్దేరాడు. 


అక్కడ అతని భార్య వేరే వ్యక్తిని వివాహం చేసుకుందని, ఆన్‌లైన్ తాను చూసిన దృశ్యాలు నిజమేనని తెలుసుకుని నివ్వెరపోయాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. కాగా.. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తి భార్య అతడినే కాకుండా మరో 19 మందిని కూడా ఇలానే పెళ్లి చేసుకుని మోసం చేసిందనే విషయం బయటపడింది. వయసు ముదిరిన వాళ్లను టార్గెట్ చేసుకుని.. ఎదురుకట్నాలను తీసుకుని పెళ్లి చేసుకుంటూ మోసాలకు పాల్పడుందని పోలీసులు తేల్చేశారు. అంతేకాకుండా ఎదురుకట్నం పేరుతో ఆమె సుమారు 2 మిలియన్ యువాన్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 2.28కోట్లు) వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే మోసానికి పాల్పడిన మహిళతో ఆమెకు సహకరించిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement