Advertisement
Advertisement
Abn logo
Advertisement

భార్య మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసిన భర్త.. తిరిగొచ్చిన భార్య

విజయవాడ: ప్రభుత్వాస్పత్రి నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఓ మహిళ మృతదేహాన్ని ఆమె భర్తకు వైద్యులు అప్పగించారు. దీంతో ఆ కుటుంబ శోకసంద్రంలో ముగినిపోయింది. కుటుంబం సభ్యులు సదరు మహిళకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె జ్ఞాపకాల నుంచి భర్త ఇంకా తేరుకోలేదు. సరిగ్గా 18 రోజులకు ఆ మహిళ తిరిగి వచ్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జరిగిన తప్పిదం ఆలస్యంగా వెలుగుచూసింది. మే 15న జగ్గయ్యపేటకు చెందిన గిరిజమ్మ మృతిచెందిందని మృతదేహాన్ని భర్త గడ్డయ్యకు ఆస్పత్రి సిబ్బంది అప్పగించింది. దీంతో ఆయన ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.


మే 23న కరోనాతో ఖమ్మం ఆసుపత్రిలో గిరిజమ్మ కొడుకు రమేష్‌ మృతి చెందారు. రెండు రోజుల క్రితమే తల్లీకొడుకులకు గడ్డయ్య దశదినకర్మలు పూర్తి చేశారు. అయితే బుధవారం ఆ కుటుంబసభ్యులను షాక్‌ గురిచేసే ఘటన చోటుచేసుంది. జగ్గయ్యపేటకు గడ్డయ్య భార్య గిరిజమ్మ వచ్చింది. ప్రభుత్వాస్పత్రి నిర్లక్ష్యంపై కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. ఎవరు చనిపోయారో నిర్థారించకుండా ఎలా అప్పగిస్తారని గిరిజమ్మ భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు గిరిజమ్మ తిరిగి రావడంతో గడ్డయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొడుకును తలచుకుని భార్తభర్తలిద్దరూ కుమలికుమిలి ఏడుస్తున్నారు. ఓ కంట ఆనందం మరో కంట దు:ఖంతో ఆ కుటుంబం మునిగిపోయింది.

Advertisement
Advertisement