స్కూలు వయసు నుంచి అతణ్ని ప్రేమించింది.. అతనితో పెళ్లి కోసం మతం కూడా మార్చుకుంది.. చివరకు ఆమె జీవితం ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-01-27T17:15:43+05:30 IST

స్కూలు రోజుల నుంచి అతడంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం.. ఆమె ప్రేమ వయసుతో పాటే పెరిగి పెద్దదైంది.

స్కూలు వయసు నుంచి అతణ్ని ప్రేమించింది.. అతనితో పెళ్లి కోసం మతం కూడా మార్చుకుంది.. చివరకు ఆమె జీవితం ఏమైందంటే..

స్కూలు రోజుల నుంచి అతడంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం.. ఆమె ప్రేమ వయసుతో పాటే పెరిగి పెద్దదైంది.. యుక్త వయసు రాగానే అతడిని పెళ్లి చేసుకునేందుకు మతం మార్చుకుంది.. తల్లిదండ్రులను ఎదురించి అతడితో వెళ్లిపోయింది.. అయితే పెళ్లి చేసుకున్న రెండేళ్ల తర్వాత ఆమె జీవితం తల్లకిందులైంది.. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. అడ్డు చెప్పిందని ఈమెను చితక్కొట్టి రోడ్డు మీదకు గెంటేశాడు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 


రాజస్థాన్‌లోని ఛిత్తోర్‌గఢ్ ప్రాంతానికి చెందిన టీనా శర్మ అనే మహిళ తన్వీర్ ఖాన్‌ను చిన్నప్పటి నుంచి ప్రేమించింది. కాలేజీ చదువు పూర్తయిన తర్వాత 2015లో తన్వీర్‌ను వివాహం చేసుకుని తొషీనా ఖాన్‌గా మారిపోయింది. తల్లిదండ్రులతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని తన్వీర్‌తో వెళ్లిపోయింది. మొదటి రెండేళ్లు బాగానే గడిచాయి. ఆ తర్వాత ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. తన్వీర్ తన మతానికే చెందిన వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 


ఆ విషయం తెలియడంతో తొషీనా గొడవపెట్టింది. తన్వీర్ తల్లిదండ్రులు, సోదరుడు కూడా తొషీనాకు మద్దతుగా నిలవలేదు. రోజూ గొడవ చేస్తోందనే కారణంతో భార్యను తన్వీర్ చితక్కొట్టాడు. అందరూ కలిసి తొషీనాను గత సోమవారం ఇంటి నుంచి బయటకు తరిమేశారు. వేరే దారి లేక తొషీనా పోలీసులను ఆశ్రయించింది. తన భర్త, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.   

Updated Date - 2022-01-27T17:15:43+05:30 IST