Advertisement
Advertisement
Abn logo
Advertisement

సెకండ్ ఫ్లోర్‌లో ఉంటున్న యజమాని ఫ్యామిలీ.. ఫస్ట్ ఫ్లోర్‌లో అద్దెకుండే కుర్రాళ్లతో భార్యకు సంబంధం ఉందని ఆ భర్తకు డౌట్.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: అప్పటి వరకూ ఆ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. వారి సంసార జీవితం సాఫీగానే సాగుతుంది. ఈ క్రమంలోనే వారి ఇంట్లోకి కొందరు కాలేజీ కుర్రాళ్లు అద్దెకు దిగారు. కారణాలు తెలియవు కానీ.. ఫస్ట్ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న ఆ కుర్రాళ్ల‌తో తన భార్యకు సంబంధం ఉందేమో అని భర్తకు డౌటొచ్చింది. కాగా.. ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌కు చెందిన బాల్ శ్యామ్ అనే వ్యక్తికి.. రష్మీ యాదవ్ అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజుల క్రితం వరకూ వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఆర్థిక సమస్యలు కూడా ఏమీ లేకపోవడంతో ఆ దంపతులు సంతోషంగా ఉన్నారు. వారికి మూడు అంస్థుల భవనం ఉండగా.. అందులో కొన్ని గదులను కిరాయికి ఇచ్చి, ఈ దంపతులు మాత్రం రెండో అంతస్థులో ఉండేవారు. అయితే తాజాగా మొదటి అంస్థులో ఓ గది ఖాళీ అవడంతో.. దాన్ని కొందరు కాలేజీ కుర్రాళ్లకు అద్దెకిచ్చారు. 

కాలేజీ కుర్రాళ్లు ఆ ఇంట్లోకి అద్దెకు దిగిన కొద్ది రోజులకే భార్యభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. కాలేజీ కుర్రాళ్లతో తన భార్య రష్మీ సంబంధం పెట్టుకుందేమో అనే డౌట్ బాల్ శ్యామ్‌‌కు రావడంతో.. వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగేది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం.. భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. మాటమాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాల్ శ్యామ్.. ఇనుమ రాడ్‌తో రష్మీ‌పై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. బాల్ శ్యామ్‌పై కేసు నమోదు చేయడంతోపాటు అతడిని జైలుకు తరలించారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement