Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాలుగేళ్ల క్రితం పెళ్లి.. భార్యతో హ్యాపీగా ఉండాల్సింది పోయి ఆ భర్తకు ఇదేం పాడు బుద్ధి.. ఓ రోజు రాత్రి..

ఆనందంగా జీవితం గడపాల్సిన భార్యభర్తల మధ్య ఒక్కోసారి చిచ్చు పెట్టేది తమ కుటుంబసభ్యులే.. అలాంటి ఒక ఘటన బీహార్‌లో జరిగింది. ఆ కలహాలు పెరిగి హత్యకు దారితీశాయి.


బీహార్ రాజధాని పాట్నాలో నివసించే సన్నీ పాస్‌వాన్ అనే యువకునికి అదే నగరానికి చెందిన వర్షతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సన్నీకి మరొక మహిళతో సంబంధం ఉందని వర్ష గ్రహించింది. ఈ కారణంగా వారిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. దీంతో వర్ష తన పుట్టింటికి వెళ్లిపోయింది. 


అలా కిన్ని రోజుల తరువాత వర్ష ఒకరోజు తిరిగి తన ఇంటికి వచ్చేసరికి అక్కడ జరిగేది చూసి ఒక్కసారిగి షాక్‌కు గురైంది. తన భర్త ఒక పరాయి స్త్రీతో తన గదిలో శృంగారంలో ఉన్నాడు. అంతేకాదు ఆ స్త్రీ మరెవరో కాదు వర్ష సొంత చెల్లెలు. ఇన్నాళ్లు వర్ష అనుమానించినట్లు తన భర్తకు పరాయి స్త్రీతో వివాహేతర సంబంధంమున్న విషయం నిజమని తేలింది.. కానీ మరీ బావ మరదళ్ల మధ్య ఇలాంటి సంబంధముంటుదని ఊహించలేకపోయింది. దీంతో వర్ష అక్కడికక్కడే వారిద్దిరితో గొడవకు దిగింది. ఊరంతా వారి గురించి చెబుతానని బెదిరించింది.


అప్పుడు సన్నీ, అతని మరదలు ఆమెను హత్య చేశారు. ఆ తరువాత శవాన్ని ఒక పెద్ద సూట్‌కేసులో పెట్టి ఇంటి నుంచి బయటి తీసుకు వస్తుండగా.. సూట్‌కేసు అనుకోకుండా తెరుచుకుంది. ఆ సమయంలో తన పొరుగింటివారు బయటే ఉన్నారు. ఇదంతా గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చూడగా.. వర్ష శవం గొంతు, మెడ భాగం తాడు మరకలున్నాయి.


వర్షను చంపడానికి సన్నీ, అతని మరదలు ముందుగా ఆమెను ఒక తాడుతో ఉరివేసి ఆ తరువాత ఇలా సూట్‌కేసులో తీసుకెళ్లాలని ప్లాన్ వేసినట్టు పోలీసులు అంచనా వేశారు. ప్రస్తుతం వర్ష వాళ్ల అన్న చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పరారీ ఉన్న వర్ష భర్త, ఆమె సోదరిపై హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement