Advertisement
Advertisement
Abn logo
Advertisement

భార్య చెల్లితో Love.. పెళ్లి చేయాలని గొడవ.. మరదలితో Tirupatiకి వెళ్లి లాడ్జిలో రూమ్ తీసుకుని..!

హైదరాబాద్ సిటీ/తిరుపతి : హైదరాబాద్‌కు చెందిన యువకుడు మరదలు (భార్య చెల్లెలు)తో ప్రేమలో పడ్డాడు. తమ పెళ్లి చేయాలంటూ భార్యతో గొడవపడ్డాడు. చివరకు మరదలితో కలిసి తిరుపతికి చేరుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అతడు మృతిచెందగా, ఆమె బతికి బయటపడింది. దీనికి సంబంధించి ఈస్ట్‌ ఎస్‌ఐ జయస్వాములు తెలిపిన ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి (26)కి అదే నగరానికి చెందిన యువతితో రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. కొన్నాళ్ల కిందట భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇదిలా ఉండగా.. తన మరదలితో అతను ప్రేమలో పడ్డాడు.

ఆమెనిచ్చి పెళ్లిచేయాలంటూ భార్యతో గొడవ పడేవాడు. ఈ వ్యవహారం శ్రుతిమించడంతో ఆమె తల్లిదండ్రులు, తమ చిన్న కుమార్తెను తీసుకుని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు వచ్చేశారు. ఈ క్రమంలో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ భార్యతో గొడవ పడుతుండగా.. ఆమె తల్లిదండ్రులు మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పది రోజుల కిందట అల్లుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారిస్తుండగానే అతడు తన మరదలిని తీసుకుని సోమవారం తిరుపతికి వచ్చాడు. రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని బస చేశారు. విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు.

అయితే బుధవారం రాత్రి లాడ్జిలోని బాత్రూమ్‌లో అతను ఉరేసుకోగా.. అతడి మరదలు నిద్ర మాత్రలు మింగింది. గురువారం స్పృహలోకి వచ్చిన ఆమె.. లేచి చూడగా అతను మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాన్ని లాడ్జి సిబ్బందికి చెప్పడంతో వారు ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. ఎస్‌ఐ జయస్వాములు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమాత్రలు మింగిన యువతి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement