Abn logo
Oct 1 2021 @ 21:41PM

అందమైన యువతిని పెళ్లి చేసుకున్నాడు.. అయితే అంతా ఆమెనే చూస్తున్నారని.. ఏం చేశాడంటే..

అందమైన భార్య కావాలని అందరికీ ఉంటుంది. కానీ కొందరికే ఆ అదృష్టం దక్కుతుంది. అలాంటి వారి జీవితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే అన్నీ అనుకున్నట్టే జరిగి.. అందమైన భార్య దక్కినా.. ఓ వ్యక్తిలో మాత్రం ఏమాత్రం సంతోషం లేదు. ఇదేంటి అనుకుంటున్నారా.. అతడి గురించి తెలిస్తే, ప్రపంచంలో ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యమేస్తుంది. వెనువెంటనే పట్టరాని కోపం కూడా వస్తుంది. సినిమా తరహాలో జరిగిన ఈ ఘటన.. వివరాల్లోకి వెళితే.. 


బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్‌లో బీఆర్ కాంతరాజు(40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఫైనాన్స్ వ్యాపారం చేసే ఇతను.. రూప(32) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిలో రూపను చూసిన వారంతా.. అపురూప సౌందర్యవతి అని ఆశ్చర్యపోయారు. తన భార్య అందం గురించి పలువురు.. పదే పదే పొగుడుతుంటే ముందు అందరిలాగానే సంబరపడ్డాడు. అయితే రానురాను కాంతరాజులోని.. కర్కోటకుడు నిద్రలేచాడు. రూపవతిని చేసుకున్నానని సంతోషపడకుండా.. ఆ అందాన్ని తాను ఒక్కడినే చూడాలనుకున్నాడు. ఎవరైనా తన భార్యను చూస్తే.. సహించలేకపోయాడు.

ఈ క్రమంలో రూప తన పుట్టింటి వారితో కలిసి చిక్‌మంగళూరుకు టూర్‌కు వెళ్లింది. కాంతరాజు కూడా వెంటే వెళ్లాడు. అక్కడ యువకులు మొత్తం తన భార్యనే చూస్తున్నారని అసూయ చెందాడు. ఆఖరికి దగ్గరి బంధువులతో మాట్లాడుతున్నా తట్టుకోలేకపోయాడు. ఆ సమయంలోనే తన బంధువులైన ఇద్దరు యువకులతో రూప డ్యాన్స్ చేసింది. అది చూసి కాంతరాజు ఆగ్రహంతో ఊగిపోయాడు. తన భార్యను అంతా చూస్తున్నారు.. తాను లేనప్పుడు ఎవరో ఒకరితో ప్రేమలో పడుతుంది.. ఇలా ఏవేవో అనుమానాలు పెట్టుకుని ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో పలు కన్నడ సినిమాలు చూసి.. చంపేయాలని ప్లాన్ వేశాడు. 


రోజూ కావాలనే రూపతో గొడవ పెట్టుకునేవాడు. నీకు అందరితో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ టార్చర్ చేసేవాడు. టూర్‌లో యువకులతో వేసిన డ్యాన్స్‌ను గుర్తు చేస్తూ గొడవ చేశాడు. తనకు ఏం సంబంధమూ లేదని రూప వారిస్తున్నా వినలేదు. చివరకు పట్టలేని ఆగ్రహంతో స్క్రూడైవర్ తీసుకుని.. ఒక్కసారిగా రూప గొంతులో పొడిచాడు. అంతటితో ఆగకుండా కత్తితో మెడ కోసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. బెడ్‌పై రక్తపు మడుగులో పడివున్న రూప మృతదేహాన్ని చూసిన.. ఆమె మామ షాక్ అయ్యాడు. రూప చెల్లెలికి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పరారీలో ఉన్న కాంతరాజు.. ఓ రోజు డబ్బుల కోసం స్నేహితుడికి కాల్ చేశాడు. దీంతో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు.. అతడిని మాటు వేసి పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...