Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆఫీసులో పనుంది.. రోజూ లేటవుతుందంటూ చెప్పుకొచ్చిన భార్య.. ఓ రోజు సెల్‌లో వీడియో చూసి షాకైన భర్త.. చివరికి ఏమైందంటే..

ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. అయితే కొన్ని కుటుంబాల్లో మాత్రం సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల జీవితాల్లో.. మళ్లీ ప్రేమ కారణంగా చిచ్చు మొదలవుతుంటుంది. భార్యాభర్తలు.. ఒకరిమీద ఒకరు ప్రేమ చూపించుకుంటే సమస్యలు ఉండవు. కానీ పరాయి మగవారు, పరాయి ఆడవారిపై చూపిస్తే.. మొదటికే మోసం జరుగుతుంది. మహారాష్ట్రలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ.. వివరాల్లోకి వెళితే..

కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన శివకుమార్, అఖిల ప్రేమించుకున్నారు. కొన్నేళ్ల క్రితం వారికి వివాహమైంది. తర్వాత ఏ సమస్యలూ లేకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో 2016లో అఖిల ఓ గ్యాస్ ఏజెన్సీలో పనికి కుదిరింది. ఓ వైపు జాబ్ చేస్తూ, మరోవైపు ఇంటి పనులు చేసుకుంటూ సంతోషంగా ఉండేవారు. ఇలావుండగా గ్యాస్ ఏజెన్సీలో విష్ణు అనే యువకుడితో అఖిలకు పరిచయం ఏర్పడింది. రోజూ మాట్లాడుకునే వారు. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రేమించి చేసుకున్న భర్తను మరిచిపోయి.. ప్రియుడిపైనే ప్రేమను చూపించడం మొదలెట్టింది. పలుమార్లు శారీరకంగా కలిసేవారు. భర్త అడిగితే.. ఆఫీసులో ముఖ్యమైన పనుంది, లేటవుతుంది అని బుకాయించేది.

అఖిలతో శారీరకంగా కలిసే సమయంలో ఆమె ప్రియుడు సెల్‌లో వీడియో తీసేవాడు. కొన్నాళ్ల తర్వాత భర్తకు విషయం తెలిసి.. భార్యను మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా భర్త మందలించాడన్న విషయాన్ని ప్రియుడికి తెలియజేసింది. ఎలాగైనా అఖిలను సొంతం చేసుకోవాలని అతను కుట్ర పన్నాడు. ఆమెతో కలిసిన వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ఓ రోజు అఖిల భర్త సెల్‌లో భార్య వీడియో చూసి షాక్ అయ్యాడు. ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్థానం చెందాడు. 2109 సెప్టెంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత అఖిల, ఆమె ప్రియుడితో స్వేచ్ఛగా తిరగడం మొదలెట్టింది. మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరూ తప్పించుకుని తిరిగేవారు. ఇటీవల ఎట్టకేలకు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement