Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రేమ పెళ్లి జరిగిన రెండు నెలలకే పాపకు జన్మనిచ్చిన యువతి.. భర్త ప్రవర్తనలో అనూహ్య మార్పు.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్:  ఆమెకు పద్దెనిమిదేళ్లు కూడా నిండలేదు. మంచి చెడూ తెలియని వయసు. కానీ పెద్దలను ఎదిరించి మరీ ఎదురింటి కుర్రాడితో వెళ్లిపోయింది. ఆ జంట ఆరు నెలల పాటు ఎక్కడెక్కడో తలదాచుకుంది. ఎట్టకేలకు వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమె గర్భవతి కావడంతో పెళ్లైన రెండు నెలలకు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు ప్రస్తుతం నాలుగో నెల. అయితే.. పాప పుట్టిన దగ్గరనుంచీ భర్తలో ఏదో మార్పు. మొదట అతడికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించింది కానీ అది కుదరలేదు. రోజు రోజుకూ భర్త టార్చర్ ఎక్కువైపోతోంది. చివరికి ఆమె ఇటీవల ఓ రోజున సంచలన నిర్ణయం తీసుకుంది. పొత్తిళ్లలోని బిడ్డకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకుంది.  మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన రజినీ దీన గాధ ఇది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ దంపతులు ఇండోర్ జిల్లా ఖుర్దీ గ్రామంలో నివసిస్తుండేవారు. పాప పుట్టాక రజినీ తన భర్తలో మార్పులు చోటుచేసుకోవడం గమనించింది. ఆ తరువాత అతడు మానసికంగా వేధించడం మొదలెట్టాడు. ఆడపిల్లను కన్నావంటూ అతడు నిత్యం భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. అతడి సూటిపోటి మాటలకు ఆమె ఎంతో క్షోభను అనుభవించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నిజస్వరూపం తెలిసి ఆమె కుంగిపోయింది. కానీ..ఆమె భర్త సుభాష్‌లోమాత్రం ఎటువంటి మార్పు రాకపోగా.. వేధింపులను మరింత పెంచాడు. ఈ టార్చర్ భరించలేపోయిన రజినీ నవంబర్ 7న ఘోరమైన ఈ నిర్ణయం తీసుకుంది.  భర్త వేధింపులు తట్టుకోలేకే రజినీ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు.  తనను నమ్మి వెంట వచ్చిన భార్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన సుభాష్ దారుణానికి పాల్పడ్డాడంటూ వారు బోరున విలపించారు. నిందితుడికి శిక్ష పడేలా చేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement