Advertisement
Advertisement
Abn logo
Advertisement

భార్యను పక్కన పెట్టుకుని అశ్లీల వీడియోలు చూస్తున్న భర్త.. తర్వాత భార్యకు జరిగిన దారుణం తెలుసుకుని అంతా షాక్..!

ఇంటర్నెట్‌ను కొందరు మంచికోసం ఉపయోగిస్తుంటే.. ఇంకొందరు మాత్రం చట్ట వ్యతిరేక పనుల కోసం వినియోగిస్తుంటారు. ఇటీవల కొందరైతే అశ్లీల వీడియోలకు అడిక్ట్ అవుతున్నారు. వాటి కోసం ఎంత  ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. చివరకు దారుణంగా మోసపోతుంటారు. విషయానికొస్తే.. బెంగళూరులో నూతనంగా పెళ్లిచేసుకున్న భర్తకు అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉంది. పెళ్లైన మరుసటి రోజు.. భార్యను పక్కన పెట్టుకుని మరీ వీడియోలు చూపించాడు. చివరకు అతడు చేసిన పని ఎంత వరకు వెళ్లిందంటే..

బెంగళూరులోని జయనగర్‌కు చెందిన యువతికి.. 2019 నవంబర్‌లో ఓ యువకుడితో వివాహమైంది. లక్ష రూపాయలు విలువ చేసే బంగారం, రెండు లక్షల నగదును కట్నంగా ఇచ్చారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. తర్వాతే అసలు విషయం బయటపడింది. అప్పటికే అతడికి రోజూ అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉంది. రోజూ వీడియోలు చూస్తూ అడిక్ట్ అయిపోయాడు. అందుకోసం చాలా ఖర్చు చేసేవాడు. రాత్రిళ్లు కాల్ గర్ల్స్‌తో చాటింగ్ చేసేవాడు. అయితే పెళ్లైన మరుసటి రోజు భార్యను పక్కన పెట్టుకుని మరీ వీడియోలను చూపించాడు.

దీంతో కోపం తెచ్చుకున్న భార్య.. భర్తను మందలించింది. పద్ధతి మార్చుకోవాలని సూచించింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో విషయం అత్త, మామలకు తెలిపింది. కోడలికి సర్దిచెప్పిన అత్త, మామలు.. కొన్నాళ్లయితే మారతాడులే అనుకున్నారు. కానీ అతడిలో మాత్రం కొంచెం కూడా మార్పు రాలేదు. భార్య రోజూ గొడవ పడుతుండడంతో కోపం పెంచుకున్నాడు. అప్పటి నుంచి వేధించడం మొదలెట్టాడు. ఎవరితోనే కలవనీయకుండా చేశాడు. వివిధ సాకులు చూపించి చిత్రహింసలకు గురి చేసేవాడు.

అంతటితో ఆగకుండా.. ఓ రోజు భార్య ఫొటోలను కాల్‌గర్ల్స్‌ యాప్‌, మ్యాట్రిమోనీ తదితర వెబ్‌సైట్లలో పోస్టు చేశాడు. దీంతో ఆమెకు విపరీతంగా పోన్లు రావడం మొదలెట్టాయి. రోజురోజుకూ ఎక్కువవడంతో తట్టుకోలేక.. చివరకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో భర్త నిర్వాకం బయటపడింది. దీంతో ఆమె.. తనకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టుకు విన్నవించుకుంది. విచారించిన న్యాయస్థానం.. పూర్తి వివరాలను అందించాలని పోలీసులను ఆదేశించింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement