ఆడపిల్ల పుట్టిందని భార్యను గెంటేసిన భర్త

ABN , First Publish Date - 2020-07-30T22:03:10+05:30 IST

ఆడపిల్ల పుట్టిందని భార్య నిర్మలను ఇంటి నుంచి భర్త గెంటేసిన ఘటన ..

ఆడపిల్ల పుట్టిందని భార్యను గెంటేసిన భర్త

హన్మకొండ: ఆడపిల్ల పుట్టిందని భార్య నిర్మలను ఇంటి నుంచి భర్త గెంటేసిన ఘటన వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగింది. న్యాయం చేయాలంటూ భర్త బాలరాజు ఇంటి ముందు ఆమె న్యాయ పోరాటానికి దిగింది. చెన్నపెండ్యాలకు చెందిన బాలరాజు సిద్ధాపురానికి చెందిన నిర్మలకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ మధ్యే ఆడపిల్ల పుట్టింది. దీంతో భార్య నిర్మలను ఇంటినుంచి గెంటేశాడు. దీంతో నిర్మల తనకు న్యాయం చేయాలని, తనకు, తన బిడ్డకు రక్షణ కల్పించాలంటూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. 

Updated Date - 2020-07-30T22:03:10+05:30 IST