Abn logo
May 13 2021 @ 00:00AM

అనుమానంతో భార్యను చంపిన భర్త

నందలూరు, మే 13 : అనుమానంతో గర్భిణీ అని కూడా చూడకుండా కట్టుకున్న భార్యను కడతేర్చిన సంఘటన బుధవారం రాత్రి నందలూరు మండలం టంగుటూరు దళితవాడలో చోటు చేసుకుంది. ఒంటిమిట్ట సీఐ హనుమంతునాయక్‌ కథ నం మేరకు వివరాలిలా.. నందలూరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన సిద్దవటం నరసయ్య, లక్ష్మమ్మలకు 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. నాలుగు నెలల క్రితం గర్భం దాల్చడంతో భార్యపై అనుమానం కలిగిం ది. దీంతో బుధవారం టంగుటూరులోని తన సొంత మామిడి తోటలోకి ఉదయం 7గంటల సమయంలో భార్య లక్ష్మమ్మను వెంట తీసుకువెళ్లి 11 గంటల సమయంలో హత్య చేశాడు. మృతురాలు లక్షుమ్మ శరీరంపై, గొంతుపై గాయాలు ఉండటంతో తల్లిదండ్రులు పోలీ సులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామని సీఐ తెలిపారు. లక్షుమ్మ హత్యకు గురైనట్లు గుర్తించి శవపరీక్ష నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సీఐ వెంట ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి, పోలీసులు వున్నారు.


Advertisement