Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంత పని చేశావయ్యా.. భార్యపై ఎంత కోపం ఉంటే మాత్రం.. ఇలా చేయాలా..? వీధి వీధంతా రోడ్డున పడ్డారు కదయ్యా..!

భార్యభర్తలు గొడవపడడం సహజం. అలాంటి గొడవలు పెద్దవై ఒకరినొకరు కొట్టుకోవడం వరకూ విని ఉంటారు. కానీ ఎక్కడైనా భార్యభర్తల గొడవలో ఇరుగుపొరుగువారు బలికావడం విన్నారా? లేదు కదా.. కానీ అలా జరిగింది. అసలు ఏం జరిగిదంటే..


మహారాష్ట్రలోని మజ్‌గావ్‌లో నివసించే సంజయ్ పాటిల్, పల్లవి అనే దంపతులు తరుచూ గొడవపడేవారు. అలాగే ఒకరోజు ఏదో విషయంలో గొడవపడ్డారు.. ఆ గొడవ పెద్దదై వాళ్లిద్దరూ కొట్టుకునేవరకూ వచ్చింది. గొడవలో సంజయ్‌ను పల్లవి తిరిగి కొట్టడంతో పట్టలేని కోపంతో సంజయ్ ఇంటిపై పెట్రోల్ పోసి అగ్గి రాజేశాడు. అగ్గి తక్కువ సమయంలో ఇల్లంతా వ్యాపించింది. ఎవరూ దానిని ఆపాలని ప్రయత్నించకపోవడంతో నిప్పు చుట్టుపక్కల మరో 10 ఇళ్లకు వ్యాపించింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరేవరకు పెద్దమొత్తంలో(కొట్ల రూపాయలలో) ఆస్తి నష్టం జరిగింది, అదృష్టం కొద్దీ ప్రాణ నష్టం జరగలేదు. సంఘటన తరువాత ఆ పొరుగిళ్లలో ఉండేవారు.. సంజయ్‌ని పట్టుకొని చితకబాదారు. పోలీసులు కలుగజేసుకొని సంజయ్‌ని అరెస్టు చేశారు. పల్లవి కూడా అతనిపై గృహహింస కేసు పెట్టింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement