Advertisement
Advertisement
Abn logo
Advertisement

తరచూ ఫోన్లో మాట్లాడుతున్న భార్య.. విషయం తెలిసి ప్రియుడి వద్దే వదిలేసిన భర్త.. కానీ ఆ తర్వాతే మరో సమస్య మొదలైంది..!

కొందరి వైవాహిక జీవితంలో ఊహించని మలుపులు ఎదురవుతుంటాయి. అవి చూసేవారికి ఆసక్తికరంగా కనిపిస్తాయి. కానీ ఆ బాధను ఎదుర్కొనే దంపతులకు ఆ సమయంలో జీవితంలో కఠిన పరీక్ష ఎదురైనట్లు అనిపిస్తుంది. యూపీలోని మురాదాబాద్ జిల్లా మఝోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక భర్త తన భార్యను ఆమె ప్రియుని చెంతకు చేర్చాడు. అయితే ఆ ప్రేమికునితో ఎనిమిది నెలలు కలిసివున్న ఆమెకు... తిరిగి ఆమె భర్తతో పాటు కుమార్తె గుర్తుకువచ్చారు. 

ఈ విషయం ఆమె ప్రేమికునికి తెలియడంతో వారిద్దరి మధ్య వివాదం నెలకొంది. ఇది మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఫలితంగా ఆ మహిళ తన ప్రియునితోనే ఉండేందుకు రాజీ పడింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మఝోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న మహిళకు అదే ప్రాంతానికి చెందిన ఒక యువకునితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి అనంతరం వారి వైవాహిక జీవితం సవ్యంగానే సాగింది. ఈ నేపధ్యంలో ఆమె ఒక బాలికకు కూడా జన్మనిచ్చింది. కొన్నాళ్లకు ఆ మహిళ ఎవరికో ఫోన్ చేస్తుండటాన్ని ఆమె భర్త గమనించాడు. అతను భార్యను నిలదీసేసరికి ఆమె ఏవో విషయాలు చెబుతూ మాట దాటవేసింది. అయితే మరోమారు ఆమె ఇదేవిధంగా ఫోనులో మాట్లాడుతుండగా భర్త ఆమెను రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నాడు.

దీంతో ఆమె తనకు పెళ్లికి ముందు నుంచి ఒక యువకునితో పరిచయం ఉన్న విషయాన్ని వెల్లడించింది. ఈ విషయం తెలియగానే భర్త ఆమెను ఎనిమిది నెలల క్రితమే ప్రేమికుని దగ్గరకు చేర్చాడు. అప్పటి నుంచి భార్యతో సంబంధాన్ని వదులుకున్నాడు. అయితే ఇటీవల ఆమె తిరిగి భర్తతో ఫోనులో మాట్లాడుతుండటాన్ని ఆమె ప్రేమికుడు గమనించాడు. దీంతో అతను ప్రశ్నించడంతో ఆమె... తనకు భర్త, కుమార్తె తరచూ గుర్తుకువస్తున్నారని చెప్పింది. ఫలితంగా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అతను ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. అక్కడ ఆమెకు, ఆమె ప్రియునికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరికి ఆమె ప్రియునితోనే ఉండేందుకు రాజీ పడింది. అలాగే భర్తతో ఇకపై మాట్లాడనని కూడా తెలిపింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement