హుషారుగా రబీ

ABN , First Publish Date - 2021-10-25T04:35:33+05:30 IST

మండల పరిధిలో వరి సాగు రైతులతో పంట కళ కనిపిస్తుంది. రబీ సాగును వేగవంతంగా చేపట్టారు.

హుషారుగా రబీ
జంగంవారిదొరువులో వరి నాట్లు

9వేల హెక్టార్లలో సాగుకు సన్నద్ధమైన అన్నదాతలు

జలకళతో చెరువులు, దొరువులు


ఇందుకూరుపేట, అక్టోబరు 24 :  మండల పరిధిలో వరి సాగు రైతులతో పంట కళ కనిపిస్తుంది. రబీ సాగును వేగవంతంగా చేపట్టారు. ఇప్పటికే వర్షపాతం నమోదు కావడం, పెన్నానది నిండా చివరి గ్రామం వరకు వరద రావడం, చెరువులు, దొరువులు జలకళతో నిండి ఉండడంతో రబీ వైపు మరింత ఉత్సాహంగా రైతులు సాగు చేపట్టారు. దాదాపు 9వేల హెక్టార్లలో సాగును చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గత సీజన్‌ 1010 పంటను కూడా కొనుగోలు చేయడంతో రైతులు రబీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ సీజన్‌లో జిలకర, నెల్లూరు మసూర, తెలంగాణా మసూరాల వైపు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 170 క్వింటాళ్లు వరి విత్తనం పంపిణీకి సిద్ధంగా ఉంది. అలాగే 120 టన్నుల ఎరువులు కూడా సబ్సిడీపై అందించేందుకు అధికారులు ఉన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు కూడా రైతులకు అందిస్తుండడంతో మరింత సులభతరం అయింది. గత సీజన్‌లో రూ.11కోట్ల వరకు రైతుల వద్ద నుంచి పంటను మండలంలో అధికారులు కొనుగోలు చేశారు. ఇప్పటికే  కొత్తవంగడాలతో పైర్లు వేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు, నీళ్లు ఇబ్బంది లేకుంటే దిగుబడి బాగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. మండల వ్యవసాయాధికారి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహిస్తూ.. వరిసాగు పట్ల విస్తృత ప్రచారం చేయడం కూడా రబీ మరింత హుషారుగా సాగేందుకు మార్గం సులభతరం అయింది. 



Updated Date - 2021-10-25T04:35:33+05:30 IST