బిగ్ బ్రేకింగ్ : హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా..

ABN , First Publish Date - 2021-09-04T19:09:06+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితులు లేవని,,

బిగ్ బ్రేకింగ్ : హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా..

హైదరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితులు లేవని మొదట్నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే ఉపఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు సీఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా కారణంగా ఉపఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. హుజురాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఇప్పట్లో ఈ రెండు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు ఉండవని ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే మళ్లీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయ్..? అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీగా తెలియరాలేదు. కాగా.. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో.. వైసీపీ ఎమ్మెల్యే హఠాత్తుగా మరణించడంతో బద్వేల్‌లో ఉప ఎన్నిక వచ్చింది.


ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌తో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అనంతర పరిణామాలు, సీఎం కేసీఆర్‌ ప్రకటించిన దళిత బంధు సహా ఇతర ప్రభుత్వ పథకాల ప్రకటనల ఎత్తుగడలు, ప్రతిగా విపక్షాల విమర్శలతో పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కొంత ఆలస్యంగా జరిగితే, అక్కడ రాజకీయంగా తమకు ప్రయోజనం కలుగుతుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 30 లోపు పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉపఎన్నికలు, 5 రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలపై అభిప్రాయాలు తెలియజేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం విదితమే. ఇలా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలను పూర్తిగా పరిశీలించిన అనంతరం సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-09-04T19:09:06+05:30 IST