Huzurabad: పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం

ABN , First Publish Date - 2021-11-02T14:10:15+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కంపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది.

Huzurabad: పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది.   మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ అనంతరం ఈవీఎంల లెక్కింపు జరుగనుంది.   మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.  ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. 

Updated Date - 2021-11-02T14:10:15+05:30 IST