Oct 21 2021 @ 12:15PM

'శ్యామ్ సింగ రాయ్': మరోసారి హైలెట్‌గా నిలవనున్న సాయి పల్లవి సాంగ్

'శ్యామ్ సింగ రాయ్' మూవీలోని సాయిపల్లవి సాంగ్ హైలైట్‌గా నిలబోతోందని తాజాగా టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి అంటేనే ఇప్పుడు డాన్స్‌కి కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే ఆమె నటించిన 'ఫిదా' మూవీలోని 'వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే', ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ స్టోరీ' సినిమాలోని 'సారంగధరియా' పాటలు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో కలిసి సాయి పల్లవి నటిస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' మూవీలోని సాంగ్ కూడా అలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. కలకత్తా .. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ సాంగ్ వస్తుందట. క్లాసికల్ డాన్స్ టచ్‌తో సాగే ఈ సాంగ్‌లో సాయిపల్లవి డాన్స్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇందులో కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ కూడా హీరోయిన్స్. నిహారికా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.