Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారతీయుల్లో హైబ్రీడ్ ఇమ్యూనిటీ: సీఎస్ఐఆర్-ఐజీఐబీ శాస్త్రవేత్త వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారతీయుల్లో అధిక శాతం మందికి హైబ్రీడ్ రోగనిరోధకశక్తి ఉందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ(ఐజీఐబీ) డైరెక్టర్ డా. అనురాగ్ అగర్వాల్ శుక్రవారం నాడు తెలిపారు. ఈ తరహా రోగనిరోధక శక్తి ఇతర ఇమ్యూనిటీ రకాల కంటే మెరుగైనదని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నాక టీకా తీసుకున్న వారిలో ఈ తరహా రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘కరోనా నుంచి కోలుకున్నాక ఒక్క టీకా డోసు తీసుకున్నా సరే..శరీరంలో మెరుగైన ఇమ్యునిటీ వృద్ధి చెందుతుంది’’ అని డా. అగర్వాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలోని మెజారిటీ జనాభాలో ఇదే రకం ఇమ్యూనిటీ ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ పుట్టుకొచ్చాక టీకా ప్రభావశీలతపై అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డా. అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 


 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement