వలస కూలీలకు తాత్కాలిక వసతి ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్

ABN , First Publish Date - 2020-03-30T00:34:47+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర

వలస కూలీలకు తాత్కాలిక వసతి ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు తమ స్వస్థలాలకు చేరుకోలేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. హైదరాబాద్‌కి కూడా వలస వచ్చిన కూలీలు కూడా ఇదే పరిస్థితిని ఎదురుకుంటున్నారు. 


వారి పరిస్థితిని చూసి చలించిపోయిన మున్నావర్ అనే కాంట్రాక్టర్ ఓ ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకున్నాడు. ఓ నిర్మాణంలో ఉన్న స్థలంలో వలస కూలీల కోసం వసతిని ఏర్పాటు చేశాడు. అక్కడ వాళ్లు నివసించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాడు. ‘‘వాళ్లు ఆరోగ్యంగా ఉంటే వాళ్లకు భోజనం తదితర సౌకర్యాలను కల్పించేందుకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్లకు ఏదైనా అనారోగ్యం కలిగితే.. భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కానీ, అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము’’ అని మున్నావర్ తెలిపారు. మున్నావర్ చేసిన పనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

Updated Date - 2020-03-30T00:34:47+05:30 IST