నుమాయిష్‌ ఏర్పాట్ల ప్రక్రియను ప్రారంభించండి : ఈటల

ABN , First Publish Date - 2020-09-28T12:12:25+05:30 IST

ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు తప్పనిసరిగా పాటించాలని, ఏటా తరహాలో నగర వాసులకు కనువిందుచేస్తున్న ఎగ్జిబిషన్‌ నిర్వహణ సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాలన్నారు.

నుమాయిష్‌ ఏర్పాట్ల ప్రక్రియను ప్రారంభించండి : ఈటల

అఫ్జల్‌గంజ్‌, సెప్టెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి, ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌ ఆదేశించారు. ఈ మేరకు నాంపల్లిలో ఎగ్జిబిషన్‌ మేనేజింగ్‌ కమిటీ సమావేశం హాల్లో ఎగ్జిబిషన్‌ను ప్రారంభంపై సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు తప్పనిసరిగా పాటించాలని, ఏటా తరహాలో నగర వాసులకు కనువిందుచేస్తున్న ఎగ్జిబిషన్‌ నిర్వహణ సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాలన్నారు. ఈ దిశగా నుమాయిష్‌ ఏర్పాట్లను చేసుకోవాలని ఆయన నిర్దేశించినట్లు తెలిసింది. సమావేశంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్‌, ఉపాధ్యక్షుడు సురేందర్‌, కోశాధికారి వినయ్‌కుమార్‌, ప్రతినిధులు గంగాధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-28T12:12:25+05:30 IST