రెడ్డి కులం కాదు.. టైటిల్‌: డీకే అరుణ

ABN , First Publish Date - 2021-03-08T08:20:02+05:30 IST

రెడ్డి అనేది కులం కాదని.. అది ఒక టైటిల్‌ అని.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి మొదటి ముందుకు వచ్చేది రెడ్డి మాత్రమేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ అన్నారు.

రెడ్డి కులం కాదు.. టైటిల్‌: డీకే అరుణ

మేడ్చల్‌/హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రెడ్డి అనేది కులం కాదని.. అది ఒక టైటిల్‌ అని.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి మొదటి ముందుకు వచ్చేది రెడ్డి మాత్రమేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ అన్నారు. ఆదివారం మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లిలో నిర్వహించిన రెడ్ల రణభేరిలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో రెడ్ల పరిస్థితి పేరుకే గొప్పగా ఉంటుందని, అగ్రవర్ణాల్లోనూ చాలా మంది నిరుపేదలు ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రం ఈడబ్ల్యూఎ్‌స్‌ రిజర్వేషన్లను అమలు చేసినా రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో మూడేళ్లుగా అగ్రవర్ణాలకు చెందిన వేల మంది విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం వరకు, త్వరలో చేపట్టబోయే ఉద్యోగాల భర్తీలోపు రాష్ట్రంలో ఈడబ్ల్యూఎ్‌సను అమలు చేయాలన్నారు. రూ.5వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే సీఎం కేసీఆర్‌ ఉద్యోగులు, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని డీకే.అరుణ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ నాయకుల మాటలను నమ్మి మరోసారి మోసపోవద్దని అరుణ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-08T08:20:02+05:30 IST