హైదరాబాద్‌లో బెంజ్ కారు బీభత్సం

ABN , First Publish Date - 2020-11-22T12:57:37+05:30 IST

నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద ఓ బెంజ్ కార్ బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్‌లో బెంజ్ కారు బీభత్సం

హైదరాబాద్: నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద ఓ బెంజ్ కార్ బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వైపు నుండి అతివేగంగా వచ్చిన బెంజ్ కార్... ఇండికా క్యాబ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇండికా క్యా‌బ్‌లో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ పబ్ లో పీకలదాకా తాగి రోడ్డు పైకి వచ్చిన మందుబాబులు ప్రమాదానికి కారణమయ్యారు. కారులో ముగ్గురు యువకులు, ఓ అమ్మాయి ఉన్నారు. సమాచారం అందిన వెంటనే బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని కారు నడిపిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 


 ప్రమాదం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 3 వద్ద ఉన్న రాయల్ టిఫిన్ సెంటర్ డేంజర్ స్పాట్‌గా మారిందని..తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని..అక్కడ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని  వాహనదారులు కోరుతున్నారు. 

Updated Date - 2020-11-22T12:57:37+05:30 IST