Abn logo
Sep 10 2021 @ 07:43AM

Hyderabad: ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్, అత్యాచారం, హత్య

హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం, హత్య చేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటన గురువారం సాయంత్రం 5 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..పొట్టకూటి కోసం నల్గొండ జిల్లా నుంచి నగరానికి వలస వచ్చింది ఆ బాలిక కుటుంబం. ఇంట్లో ఆడుతూ..పాడుతూ..కనిపించిన బాలిక గంటల తరబడి కంటకనిపించలేదు. సాయంత్రం అయినా చిన్నారి కనిపించకపోవడంతో బాలిక ఆచూకీ కోసం 2 గంటలపాటు తల్లిదండ్రులు వెతికినా లభించలేదు. దీంతో చిన్నారి ఇంటి పక్కనే ఉండే రాజుపై అనుమానంతో అర్ధరాత్రి 12 గంటలకు రాజు ఇంట్లో చూడగా చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి బాలికపై అత్యాచారం చేసి నిందితుడు హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు.


అయితే.. పోలీసులతో అక్కడి స్థానికులు వాగ్వాదానికి దిగారు. నిందితుడిని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వి, కారం చల్లారు. దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు దాటిపోతుండటంతో కాలనీలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.