హైదరాబాద్‌లో రెండో రోజు కొనసాగుతున్న లాక్‌డౌన్

ABN , First Publish Date - 2021-05-13T13:31:10+05:30 IST

నగరంలో రెండో రోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

హైదరాబాద్‌లో రెండో రోజు కొనసాగుతున్న లాక్‌డౌన్

హైదరాబాద్‌: నగరంలో రెండో రోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. కాగా రెండో రోజు దుకాణాల వద్ద పెద్దగా క్యూలైన్లు కనిపించడం లేదు. అటు రాంనగర్ చేపల మార్కెట్‌లో రద్దీ ఎక్కువగా ఉంది. ఎలాంటి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మరోవైపు బ్యాంకులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అనుమతి ఇచ్చారు. అవసరాల కోసం ప్రజలు రోడ్లపైకి రావడంతో ఉదయం 6 గంటల నుంచే నగరంలో పలు ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Updated Date - 2021-05-13T13:31:10+05:30 IST