Abn logo
May 17 2021 @ 11:51AM

ముగ్గురు సీపీలను అభినందించిన తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్న ముగ్గురు కమిషనర్లను తెలంగాణ హైకోర్టు అభినందించింది. సోమవారం ఉదయం కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ మొదలైంది. ఈ సందర్భంగా లాక్‌డౌన్ సమయంలో, రిలాక్సేషన్ సమయంలో  వీడియో గ్రఫీ తీసిన ఫుటేజ్‌ను ముగ్గురు హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు హైకోర్టుకు సమర్పించారు. లాక్‌డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 వరకు గైడ్ లైన్స్‌ను పటిష్టంగా అమలు చేసినందుకు ముగ్గురు సీపీలకు హైకోర్టు అభినందనలు తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement