HYD: ఫార్మా కంపెనీ ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2021-08-01T15:44:42+05:30 IST

హెక్సా ప్లొర్‌ఫాస్పరిక్‌ యాసిడ్‌ను గాజు సీసాలో తీసుకువస్తుండగా ప్రమాదవశాత్తు లీకవడంతో ఒక ఫార్మా కంపెనీలో పనిచేసే అసిస్టెంట్‌ మేనేజర్‌ ...

HYD: ఫార్మా కంపెనీ ఉద్యోగి మృతి

యాసిడ్‌ తీసుకువస్తుండగా ప్రమాదం

హైదరాబాద్/అల్వాల్‌: హెక్సా ప్లొర్‌ఫాస్పరిక్‌ యాసిడ్‌ను గాజు సీసాలో తీసుకువస్తుండగా ప్రమాదవశాత్తు లీకవడంతో ఒక ఫార్మా కంపెనీలో పనిచేసే అసిస్టెంట్‌ మేనేజర్‌ మరణించిన సంఘటన శనివారం అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. అల్వాల్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ గంగాధర్‌ తెలిపిన ప్రకారం.. నెల్లూరు ప్రాంతానికి చెందిన వేములపాటి ఆనంద్‌(36) శామీర్‌పేట్‌లోని ఓ ఫార్మాకంపనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూ నిజాంపేట్‌లోని ప్రగతినగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. శనివారం సాయంత్రం ప్రగతినగర్‌ నుంచి ఒక గాజు సీసాలో 2.5 లీటర్ల  హెక్సా ప్లొర్‌ఫాస్పరిక్‌ యాసిడ్‌ను బైక్‌ పైన తీసుకుని అల్వాల్‌ లయోలా కళాశాల వద్దకు రాగానే గాజు బాటిల్‌ నుంచి లీకేజీ కావడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో ఆనంద్‌ హబ్సిగూడలో ఉండే శ్రీధర్‌రెడ్డికి ఫోన్‌ చేసి తన వద్దకు రమ్మన్నాడు. శ్రీధర్‌రెడ్డి లయోలా జూనియర్‌ కళాశాలకు వచ్చేసరికి గ్యాస్‌ ఆనంద్‌ ఉపరితిత్తులలోకి వెళ్లింది. దీంతో ఆయన అపస్మరక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆనంద్‌ మరణించాడు. అల్వాల్‌ పోలీ్‌సలు కేసు దర్యప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-01T15:44:42+05:30 IST