HYD: సినీఫక్కీలో దొంగను పట్టుకున్న కాలనీ వాసులు

ABN , First Publish Date - 2021-08-01T17:57:24+05:30 IST

సినీఫక్కీలో ఓ దొంగను స్థానికుల సహకారంతో పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన మేడిపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ...

HYD: సినీఫక్కీలో దొంగను పట్టుకున్న కాలనీ వాసులు

హైదరాబాద్/పీర్జాదిగూడ: సినీఫక్కీలో ఓ దొంగను స్థానికుల సహకారంతో పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన మేడిపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కేశవ్‌నగర్‌ కాలనీలో ఓ దొంగ దొంగతనానికి ప్రయత్నించి పోలీసులకు పట్టుబడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడేందుకు దొంగ ప్రయత్నించాడు. పక్కగదిలో ఉన్న ఇంటి యజమాని దీన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులకు కాలనీ వాసులు సహకరించి దొంగ పారిపోకుండా ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో దొంగ గోడ దూకడంతో అక్కడే మాటు వేసిన పోలీసు కానిస్టేబుల్‌, కాలనీ వాసులతో కలిసి పట్టుకున్నారు.  గత నెలలో ఇదే కాలనీలో తాళం వేసి ఉన్న మూడిండ్లలో దొంగతనానికి పాల్పడిన సంఘటన మరువక ముందే మరో దొంగతనం ప్రయత్నం జరగడం గమనార్హం. దొంగతనాలు వరుసగా జరుగుతున్నా పోలీసులు కాలనీలో పెట్రోలింగ్‌ పెంచకపోవడంపై కాలనీ వాసులు నిరసన వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2021-08-01T17:57:24+05:30 IST