వైద్యుడికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

ABN , First Publish Date - 2021-08-01T17:40:31+05:30 IST

ఆపరేషన్‌ థియేటర్‌లో రోగికి శస్త్ర చికిత్స నిర్వహిస్తున్న వైద్యుడి బ్యాంకు ఖాతాలో నుంచి సైబర్‌ నేరగాళ్లు డబ్బులు డ్రా చేశారు. నాగోల్‌కు చెందిన చైతన్య కస్తూరి ఓ ప్రముఖ

వైద్యుడికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

ఆపరేషన్‌ థియేటర్‌లో ఉండగా బ్యాంకు ఖాతా ఖాళీ

హైదరాబాద్/బంజారాహిల్స్‌: ఆపరేషన్‌ థియేటర్‌లో రోగికి శస్త్ర చికిత్స నిర్వహిస్తున్న వైద్యుడి బ్యాంకు ఖాతాలో నుంచి సైబర్‌ నేరగాళ్లు డబ్బులు డ్రా చేశారు. నాగోల్‌కు చెందిన చైతన్య కస్తూరి ఓ ప్రముఖ ఆస్పత్రిలో వైద్యుడు. ఈనెల 30న ఆయన ఆపరేషన్‌ థియేటర్‌లో శస్త్ర చికిత్స నిర్వహిస్తుండగా ఎస్‌బీఐ బ్యాంకు ఖాతా కేవైసీ నిర్వహిస్తున్నట్టు ఫోన్‌కు సమాచారం వచ్చింది. కానీ, వైద్యుడు ఆ లింకును తెరవలేదు. ఐదు నిమిషాల తరువాత రూ.50 వేలు తన ఖాతాలో నుంచి డ్రా అయినట్టు మెసేజ్‌ వచ్చింది. అప్రమత్తం అయిన డాక్టర్‌ వెంటనే విషయాన్ని బ్యాంకు నిర్వాహకులకు తెలిపి ఖాతాను స్తంభింపచేశారు. చైతన్య ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-01T17:40:31+05:30 IST