Abn logo
Sep 24 2021 @ 10:53AM

HYD: నీ అంతు చూస్తా.. తమాషా చేస్తున్నావా...

బీజేపీ నాయకుడికి కార్పొరేటర్‌ సోదరుడి బెదిరింపులు

హైదరాబాద్/బంజారాహిల్స్‌: ‘నువ్వు పెద్ద నాయకుడివి అనుకుంటున్నావా....నీ అంతు చూస్తా... తమాషా చేస్తున్నావా’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా కార్పొరేటర్‌ సోదరుడు బీజేపీ నేతను బెదిరించాడు. జూబ్లీహిల్స్‌ డివిజన్‌ ఫిలింనగర్‌లో ఓ ఆలయం విషయంలో నాలుగు నెలలుగా వివాదం నెలకొంది. ఆలయం నిర్మించాలని ఖైరతాబాద్‌ బీజేపీ నాయకుడు పల్లపు గోవర్ధన్‌ పోరాటం చేశాడు. ఈ వ్యవహారంలో కార్పొరేటర్‌ వర్గం....గోవర్ధన్‌ వర్గానికి విభేదాలు తలెత్తాయి. ఇదే విషయంలో సోషల్‌ మీడియాతోపాటు వాట్సా్‌పలో చర్చలు జరిగాయి. వాట్సా్‌పను చూసిన జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ డేరంగుల వెంకటేష్‌ సోదరుడు డేరంగుల రమేష్‌ స్పందిస్తూ పల్లపు గోవర్ధన్‌ను అతని తండ్రి పేరుతో అసభ్యంగా మాట్లాడాడు. అంతు చూస్తా అంటూ బెదిరించాడు. ఈ వ్యవహారంపై పల్లపు గోవర్ధన్‌ గురువారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలు పోలీసులకు సమర్పించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు.