Abn logo
Sep 27 2021 @ 10:57AM

అత్త అనారోగ్యంతో ఉండగా ఆస్తి అమ్మేసి.. చివరికి కోడలు చేసిన దారుణమిది..!

కులం పేరిట దూషణ.. హింసించి బయటకు గెంటేసిన వైనం

హైదరాబాద్/బంజారాహిల్స్‌: అనారోగ్యంతో బాధపడుతున్న అత్తకు మాయ మాటలు చెప్పి ఆస్తి అమ్మేసుకున్నారు. అనంతరం ఆమె దుస్తులు తగలబెట్టి, మందులు బయట పారేసి, ఆహారం ఇవ్వకుండా కొడుతూ.. కులంపేరుతో దూషించి బయటకు గెంటేసింది ఓ కోడలు. దీనికి కొడుకు కూడా సహకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బర్కత్‌పురాకు చెందిన బి.హేమలత చాలాకాలం క్రితం భర్తను కోల్పోయింది. దీంతో కుమారుడు శ్రీకాంత్‌ను  పోషిస్తూ మీర్‌పేట ఆర్‌రెడ్డి కాలనీలో ఓ ఇంటిని కొనుగోలు చేసింది.  శ్రీకాంత్‌ కొద్దికాలం కింద కె.సింధూరరెడ్డితో పరిచయం ఏర్పడి సన్నిహితంగా కలిసి ఉన్నాడు. విషయం తెలుసుకున్న తల్లి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పెళ్లి చేసుకున్నాడు. నాటినుంచి కోడలు అత్తను హింసిస్తూ వచ్చింది.


గతేడాది సింధూరరెడ్డి, ఆమె తల్లి పరిమళ రెడ్డి, సోదరుడు సాయిచరణ్‌రెడ్డి వచ్చి హేమలతను కొట్టి ఇంట్లో నుంచి తరిమేశారు. దీంతో ఆమె బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ యేడాది జనవరిలో కుమారుడు, కోడలు ఆమె వద్దకు వెళ్లి ‘తప్పయింది.. ఇక నుంచి బాగా చూసుకుంటామని’ చెప్పి తీసుకెళ్లారు. బంజారాహిల్స్‌ నెంబరు 14లోకి మకాం మార్చారు. ఏప్రిల్‌లో హేమలతకు గుండె సమస్య తలెత్తింది. ఆమె ఆస్పత్రిలో ఉండగా మాయ మాటలు చెప్పి కొడుకు, కోడలు మీర్‌పేటలో ఉన్న ఇంటిని అమ్మేశారు. హేమలత ఇంటికి వచ్చిన తరువాత కోడలు పాత పద్ధతే కొనసాగిస్తూ దుర్భాషలాడుతూ కొడుతుండటంతో ఇంట్లో నుంచి ఆమె బయటకు వెళతానని చెప్పింది. దీంతో సింధూరరెడ్డి అత్త దుస్తులను తగులబెట్టింది. అంతేకాకుండా మందులను పారేసింది. కట్టుబట్టలతో నడిరోడ్డుమీదకు నెట్టింది. కులం పేరుతో దూషించింది. ఆమె బర్కత్‌పురలోని తన పాత ఇంటికి చేరుకుంది. అనంతరం కాచిగూడ పోలీసులను ఆశ్రయించగా వారు జీరో ఎఫ్‌ఐఆర్‌ చేసి కేసును బంజారాహిల్స్‌ పోలీసులకు బదిలీ చేశారు. పోలీసులు సిందూరరెడ్డి, శ్రీకాంత్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, వృద్ధుల చట్టంలోని పలు సెక్షన్‌ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

హైదరాబాద్మరిన్ని...