Abn logo
Jul 31 2021 @ 12:21PM

HYD: బీజేపీ మహిళా మోర్చా వర్క్‌షాప్ ప్రారంభం

హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో జాతీయ మహిళా మోర్చా సోషల్ మీడియా వర్క్ షాప్ ప్రారంభమైంది. సాయంత్రం వరకు జరగనున్న  సమావేశంలో బండి సంజయ్, సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల మహిళా మోర్చా ప్రతినిధులు, పలువురు జాతీయ నేతలు సమావేశానికి హాజరయ్యారు. మీడియా, సోషల్ మీడియాపై  మహిళ మోర్చా నేతలకు బీజేపీ ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ  దిశానిర్దేశం చేయనున్నారు.  కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, పార్టీ బలోపేతానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవటంపై దిశానిర్దేశం చేస్తారు. 

హైదరాబాద్మరిన్ని...