Abn logo
Sep 24 2021 @ 08:08AM

HYD: మెట్రో రైళ్లలో పనిచేయని డిస్‌ప్లే బోర్డులు

అస్పష్టంగా మైక్‌ అనౌన్స్‌మెంట్‌

హైదరాబాద్‌ సిటీ: వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తున్నామని చెప్పుకుంటున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు ఆచరణలో విఫలమవుతున్నారు. రైళ్లలో నెలకొంటున్న సాంకేతిక సమస్యలే ఇందుకు నిదర్శనం. కరోనాతో ఏడాదిన్నర కాలంగా ఆటుపోట్లను ఎదుర్కొన్న మెట్రో రైలు నెమ్మదిగా పుంజుకుంటోంది. కరోనా తాకిడి లేకముందు మూడు కారిడార్ల పరిధిలో రోజుకు 3.80 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రయాణించగా.. ప్రస్తుతం రోజుకు 2.40 లక్షల నుంచి 2.60 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు మెట్రోవర్గాలు చెబుతున్నాయి. అధికారులు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాంకేతిక లోపంతో రైళ్లలో డిస్‌ప్లే బోర్డులు సరిగా పనిచేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైక్‌ అనౌన్స్‌మెంట్‌ సైతం అస్పష్టంగా ఉంటుండడంతో స్టేషన్లను కనుగోలేకపోతున్నామని చెబుతున్నారు. ఇటీవల ఎల్‌బీనగర్‌-మియాపూర్‌ మార్గంలో ప్రయాణించిన విద్యార్థులు, ఉద్యోగులకు రైలులో డిస్‌ప్లే బోర్డు సరిగా కనిపించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కొంతమంది దిగాల్సిన స్టేషన్‌లో దిగకుండా వేరే స్టేషన్‌లో దిగాల్సి వచ్చింది.

హైదరాబాద్మరిన్ని...