హైదరాబాద్‌ కంపెనీలకు ఎగ్జిమ్‌ బ్యాంక్‌ దన్ను

ABN , First Publish Date - 2021-11-27T06:12:34+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఎగుమతి అవసరాలకు అనుగుణంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌, అందుకు అవసరమైన ఉత్పత్తుల తయారీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాక్సిన్‌, ఫార్మా కంపెనీలకు....

హైదరాబాద్‌ కంపెనీలకు ఎగ్జిమ్‌ బ్యాంక్‌ దన్ను

వ్యాక్సిన్‌ కంపెనీలకు రుణం 

పది చిన్న కంపెనీలకు రూ100-200 కోట్ల చొప్పున నిధులు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఎగుమతి అవసరాలకు అనుగుణంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌, అందుకు అవసరమైన ఉత్పత్తుల తయారీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాక్సిన్‌, ఫార్మా కంపెనీలకు ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంక్‌) 10 కోట్ల డాలర్ల (దాదాపు రూ.750 కోట్ల) రుణ సాయాన్ని అందిస్తోంది. 6-7 కంపెనీలకు ఇప్పటికే ఈ మేరకు రుణాలను మంజూరు చేసినట్లు ఎగ్జిమ్‌ బ్యాంక్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ రమేశ్‌ తెలిపారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన రెండు కంపెనీలు కూడా ప్రయోజనం పొందాయి. భారత బయోటెక్నాలజీ, ఫార్మా కంపెనీలు ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాయి. సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ పొందేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. 


10 కంపెనీల గుర్తింపు: స్టార్ట్‌పల నుంచి చిన్న కంపెనీలుగా ఎదిగిన వివిధ హైదరాబాద్‌ కంపెనీలు అనేక ఇన్నోవేషన్‌ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. పెద్ద కంపెనీలుగా ఎదిగే అవకాశం ఉన్న చిన్న సంస్థలను గుర్తించి వాటికి అండగా నిలవాలనుకుంటున్నాం. ‘ఉభర్‌తే సితారే’ కార్యక్రమం కింద ఇన్నోవేషన్‌ ప్రాజెక్టులను చేపడుతున్న 100 కంపెనీలకు సాయం చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమం కింద ఇప్ప టివరకూ హైదరాబాద్‌కు చెందిన 10 చిన్న కంపెనీలను గుర్తించాం. కాగా మొత్తం 100 కంపెనీలకు ఒక్కొక్క దానికి రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల రుణాలు సమకూర్చే వీలుందని రమేశ్‌ అన్నారు.

Updated Date - 2021-11-27T06:12:34+05:30 IST