Advertisement
Advertisement
Abn logo
Advertisement

హోంగార్డు చికిత్సకు సైబరాబాద్ సీపీ ఆర్థిక సాయం

హైదరాబాద్: అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డుకు సైబరాబాద్ సీపీ ఆర్థిక సాయం అందజేశారు. సైబరాబాద్ పోలీసు కమీషనరేట్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఎస్ జగదీష్.. ఇటీవల అనారోగ్య సమస్యలతో సంతోష్ నగర్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర... హోంగార్డును ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా సైబరాబాద్ పోలీసుల తరపున హోంగార్డ్ జగదీష్ కుటుంబ సభ్యులకు రూ.75 వేల చెక్కును అందజేశారు.

Advertisement
Advertisement