Abn logo
Sep 26 2021 @ 12:36PM

HYD పూజల పేరుతో మోసం..హైదరాబాద్‌ అడ్డాగా దందా...

ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ

నక్సలైట్‌ పేరిట వసూళ్లు.. 

ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు 


హైదరాబాద్/ఏన్కూరు: హైదరాబాద్‌ నగరాన్ని అడ్డాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటే్‌ష కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం మర్సకుంట గ్రామానికి చెందిన రామకోటయ్య తన భార్య లక్ష్మి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పూజ లు చేస్తామని ములుగు పట్టణానికి చెందిన ఇబ్రహీం బాబాఖాన్‌, అతడి సహాయకుడు రాకే్‌షతో కలిసి ఈనెల 19న రాత్రి అతడి ఇంటికి వచ్చారు. పూజల అనంతరం లక్ష్మికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. నకిలీ బంగారు తాడును ఆమె మెడలో వేసి మూడు తులాల అసలు బంగారు తాడును తీసుకున్నారు. బీరువాలో ఉన్న రూ.3 లక్షల నగదును చోరీ చేసి ఉడాయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన ఎస్‌ఐ యలగందుల శ్రీకాంత్‌ నగరంలోని నాగోల్‌లో బంగారం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న రాజు ఇబ్రహీం బాబాఖాన్‌, రాకే్‌షలను  శుక్రవారం అరెస్టు చేశారు. బాబాఖాన్‌ గతంలో పలు నేరాల్లో నిందితుడినని, నకిలీ బంగారం, గుప్తనిధులు, మంత్రాలు, పూజలు అంటూ ఎన్నో నేరాలకు పాల్పడ్డాడని తెలిపారు. నక్సలైట్‌ అని చెప్పుకొని బలవంతపు వసూళ్లకు పాల్పడిన కేసులోనూ నిందితుడని వివరించారు. రాజుపై కూడా పలు కేసులున్నాయని, రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, హైదరాబాద్‌ను అడ్డగా చేసుకొని ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేస్తున్నట్లుగా తెలిసిందన్నారు.

హైదరాబాద్మరిన్ని...