Mahzooz millionaire: లాటరీ డ్రాకు కొన్ని గంటల ముందు కొన్న వాటర్ బాటిల్.. హైద్రాబాదీని రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేసింది!

ABN , First Publish Date - 2021-09-30T21:15:02+05:30 IST

ఏళ్ల తరబడి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి ఎప్పుడో గానీ అదృష్టం కలిసిరాదు.

Mahzooz millionaire: లాటరీ డ్రాకు కొన్ని గంటల ముందు కొన్న వాటర్ బాటిల్.. హైద్రాబాదీని రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేసింది!

దుబాయ్: ఏళ్ల తరబడి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి ఎప్పుడో గానీ అదృష్టం కలిసిరాదు. కానీ, ఈ హైద్రాబాదీ విషయంలో మాత్రం అలా జరగలేదు. లాటరీ డ్రాకు కొన్ని గంటల ముందు కొన్న ఓ వాటర్ బాటిల్ అతడి జీవితాన్నే మార్చేసింది. ఎంతలా అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసేసింది. దుబాయ్‌లో నిర్వహించే మహజూజ్ మిలినీయర్ డ్రాలో తాజాగా హైద్రాబాద్‌కు చెందిన మీర్ అనే వ్యక్తి ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఒకటికాదు రెండుకాదు ఏకంగా 1 మిలియన్ దిర్హమ్స్(సుమారు రూ.2కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. లాటరీ డ్రా నిర్వహించేందుకు ఐదు గంటల ముందు తాను కొనుగోలు చేసిన వాటర్ బాటిల్ తనకు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని తెలిపాడు. ఇలా వాటర్ బాటిల్ కొనడం ద్వారా తాను మహజూజ్‌ లాటరీలో భాగమయ్యానని పేర్కొన్నాడు. వాటర్ బాటిల్ కొన్న సమయంలో తనకు ఒక లాటరీ టికెట్ ఇచ్చారని, దానిపై ఉన్న నెంబర్‌లోని ఆరు అంకెల్లో ఐదు అంకెలు.. మహజూజ్ డ్రాలో తీసిన స్క్రాచ్‌కార్డుపై ఉన్న సంఖ్యతో మ్యాచ్ కావడంతో తాను సెకండ్ ప్రైజ్‌గా 1 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నట్లు చెప్పాడు. 


ఇక లాటరీ డ్రా తీసిన రోజు ఫలితాల గురించి పట్టించుకోని మీర్‌కు ఆ తర్వాతి రోజు నిర్వాహకులు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని చెప్పారు. మొదట ఏదో ఫ్రాంక్ కాల్ అని లైట్ తీసుకున్నాడు. కానీ, కొద్దిసేపటి తర్వాత మరోసారి అదే నంబర్ నుంచి ఫోన్ రావడం, వారు వివరాలు చెప్పడంతో మీర్ నిజంగానే తాను విజేతనని నమ్మాడు. అది కూడా ఏకంగా రూ.2కోట్లు గెలవడం ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని చెప్పుకొచ్చాడు. 12 ఏళ్ల క్రితం హైద్రాబాద్ నుంచి దుబాయ్ వెళ్లిన మీర్ అక్కడి ఓ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రెండు వారాల క్రితమే అతని భార్య కూడా ఇదే మహజూజ్ మిలియనీర్ డ్రాలో రూ.20వేలు గెలుచుకుంది. ఇప్పుడు ఈ దంపతుల ఖాతాలో ఏకంగా మరో రూ.2కోట్లు చేరబోతున్నాయి. 

Updated Date - 2021-09-30T21:15:02+05:30 IST