తెల్లవారుజామున నిజాం క్లబ్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-06-14T14:17:24+05:30 IST

నిజాం క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. మూడు ఫైర్‌ ఇంజన్లు

తెల్లవారుజామున నిజాం క్లబ్‌లో అగ్నిప్రమాదం

  • అడ్మినిస్ట్రేషన్‌ చాంబర్‌లో కాలిపోయిన సర్వర్‌, ఫర్నిచర్‌


హైదరాబాద్/ఖైరతాబాద్‌ : నిజాం క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. మూడు ఫైర్‌ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజాం క్లబ్‌లోని రెండవ అంతస్తు అడ్మినిస్ట్రేషన్‌ చాంబర్‌ నుంచి ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో పొగలు రావడం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది  క్లబ్‌ వారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న క్లబ్‌ నిర్వాహకులు వెంటనే ఫైర్‌ సర్వీసుకు ఫోన్‌ చేశారు. దీంతో సచివాలయం, అసెంబ్లీ, గౌలిగూడ స్టేషన్ల నుంచి 3 ఫైర్‌ ఇంజన్లు అక్కడకు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయంలోని సర్వర్‌, కంప్యూటర్లు, ఫర్నిచర్‌, డాక్యుమెంట్లు కాలిపోయాయి. కార్యాలయంలో చెక్కతో కూడిన కిటికీలు, ఫర్నిచర్‌ ఉండడంతో మంటలు వేగంగా అంటుకున్నాయని ఎస్‌ఐ భద్రయ్య తెలిపారు. క్లబ్‌ గౌరవ కార్యదర్శి రాజేంద్రకుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆస్తి నష్టంపై ఇంకా అంచనాలు రాలేదని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-06-14T14:17:24+05:30 IST